గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామం,లో పిచ్చికుక్కల బెడద పెరిగిపోతోంది
కాకినాడ జిల్లా
పిఠాపురం
గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామం,లో పిచ్చికుక్కల బెడద పెరిగిపోతోంది.
నాలుగేళ్ల చిన్నారి దాసం యశ్వంత్ పై ఒకేసారి నాలుగు పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం గ్రామంలో ఆందోళన కలిగిస్తోంది.
బాలుడికి శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో ముందుగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ప్రస్తుతం అక్కడ వైద్యులు బాలుడికి అత్యవసర శస్త్రచికిత్స చేస్తున్నారు.
గ్రామస్థుల సమాచారం ప్రకారం గత నాలుగు రోజుల్లోనే తాటిపర్తి గ్రామంలో సుమారు 15 మందిని పిచ్చికుక్కలు కరిచినట్లు తెలుస్తోంది.
ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
గ్రామంలో తిరుగుతున్న పిచ్చికుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఎందుకు పంపలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
చిన్నారి ప్రాణాలతో పోరాడుతున్న ఈ సమయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది.
ఇకనైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పిచ్చికుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
మరో చిన్నారికి ఇలాంటి దుర్ఘటన జరగకముందే తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.