భవిష్యత్తు వైపు విద్యార్థుల అడుగులు. ఆళ్లగడ్డలో ఘనంగా ఫేర్‌వెల్ డే.
AIMA న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని స్థానిక ఎద్దుల పాపమ్మ కాలేజీ గ్రౌండ్‌లో ప్రభుత్వ పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక (Farewell Day) గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీర రాఘవన్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ వీర రాఘవన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పదవ తరగతి అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు విద్యార్థులు కేవలం మార్కుల కోసమే కాకుండా, క్రమశిక్షణ మరియు నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుంది. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా, ఆత్మవిశ్వాసంతో పకడ్బందీగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కెవి సుబ్బారెడ్డి కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనాథ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఓబయ్య లు టెన్త్ క్లాస్ పూర్తిచేసుకున్న 170 మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు.విద్యార్థుల పట్ల సామాజిక బాధ్యతతో కె.వి సుబ్బారెడ్డి కాలేజీ వారు పరీక్షా సామగ్రిని (Exam Pads) పంపిణీ చేయడం అభినందనీయమని విద్యార్థుల అవసరాలను గుర్తించి ఇలాంటి ప్రోత్సాహకాలు అందించడం వల్ల వారిలో చదవాలనే ఉత్సాహం పెరుగుతుందని హెడ్మాస్టర్ తెలిపారు. విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉపాధ్యాయుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ వేడుకలో ఆట పాటలు కోలాట నృత్యాలు చేస్తూ అలరించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.