సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధే మా లక్ష్యం*
*కాకాణి అరిచినా, కరిచినా, మొరిగినా పట్టించుకోం* AP
*సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధే మా లక్ష్యం*
*మమ్మల్ని పొగడకపోయినా పర్వాలేదు..కోట్లాది రూపాయలు నిధులిస్తున్న కంపెనీలకు ధన్యవాదములు చెప్పాలని హితవు పలుకుతున్నాం*
*ప్రజల కోసం ఏమి అడిగినా కాదనకుండా చేస్తున్న కంపెనీలన్నింటికి రుణపడివుంటాం*
*SEIL కంపెనీ సహకారంతో చేపట్టిన 1841 సైకిళ్ల పంపిణీ రేపటికి పూర్తవుతుంది*
*యువగళం స్ఫూర్తితో చేపట్టిన 3132 సైకిళ్ల పంపిణీ లక్ష్యంలో భాగంగా మిగిలిన సైకిళ్లను త్వరలోనే విద్యార్థులకు అందిస్తాం*
*వెంకటాచలంలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఏపీ ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్.శివప్రసాద్, టీడీపీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డితో కలిసి 360 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేసిన సోమిరెడ్డి*
*మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్*
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న నారా లోకేషే బాబు మాకు ఆదర్శరం
లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్ర స్ఫూర్తితో సర్వేపల్లి నియోజకవర్గంలో 3132 సైకిళ్ల పంపిణీ చేపట్టాం
SEIL కంపెనీ అందించిన 1841 సైకిళ్ల పంపిణీని రేపటితో పూర్తి చేస్తున్నాం..మిగిలిన సైకిళ్లను కూడా విద్యార్థులకు త్వరలోనే అందిస్తాం
ఈ విషయంలో మాకు సంపూర్ణ సహకారం అందించిన SEIL సీఈఓ జన్మేజయ మహాపాత్రకు ప్రత్యేక ధన్యవాదములు
ఒక్క సైకిళ్లే కాదు...సర్వేపల్లి ప్రజల కోసం ఏమి కోరినా కాదు అనకుండా చేస్తున్నారు
నియోకవర్గంలోని సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.1.80 కోట్లు ఖర్చు పెడుతున్నారు
కోట్లాది రూపాయలతో వాటర్ ప్లాంట్లు, సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు
మల్లికార్జునపురంలో 280 కుటుంబాలు ఆర్థికంగా బలపడేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు
బ్రహ్మదేవంలో రూ.20 కోట్లతో ఆస్పత్రి నిర్మించి ఉచిత వైద్యసేవలు అందించబోతున్నారు
అదానీ కృష్ణపట్నం పోర్టు, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, పామాయిల్ ఫ్యాక్టరీలు కూడా సర్వేపల్లి అభివృద్ధికి అండగా నిలుస్తున్నాయి
ఇప్పటి వరకు రూ.42 కోట్లు సీఎస్ఆర్ నిధులను సాధించుకున్నాం
ప్రతి కంపెనీ 70 శాతం సీఎస్ఆర్ నిధులను సర్వేపల్లి నియోజకవర్గంలో కచ్చితంగా ఖర్చుపెట్టాలని కోరాను
నిత్యం అరుస్తూ, మొరుగుతున్న వాళ్లు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారు
ఏ దురుద్దేశంతో సీఎస్ఆర్ నిధుల కోసం కంపెనీలపై ఒత్తిడి తేలేదు
అప్పట్లో సర్వేపల్లిలో ఖర్చుపెట్టాల్సిన నిధులతో గుజరాత్ తదితర రాష్ట్రాల్లో పనులు చేసిన పరిస్థితి
నిత్యం తిట్టడమనే పనికిమాలిన పనులు తప్ప మంచి కార్యక్రమాలను స్వాగతించే మనస్తత్వం లేకుండా పోయింది
మమ్మల్ని పొగడాలని కోరుకోవడం లేదు....భారీగా నిధులిస్తున్న సెయిల్, అదానీ కృష్ణపట్నం పోర్టు, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ధన్యవాదములు అయినా చెప్పొచ్చు
నిద్రలేస్తే దరిద్రపు మాటలు తప్ప మరొకటి లేదు
మనుబోలులో వివాదంలో ఉన్న ప్రభుత్వ భూమిని నుడాకు అప్పగించేందుకు మేం ప్రయత్నం చేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు
ఇద్దరు తహసీల్దార్లతో పాటు ఆర్డీఓ, కలెక్టర్ల సహకారంతో ఆ భూమిని నుడాకు అప్పగించేందుకు అవసర మైన చర్యలు చేపట్టాం
కోర్టుల్లో స్టేలు తెచ్చే అలవాటున్న కాకాణి ప్రోద్బలంతోనే మనుబోలు భూముల విషయంలో స్టేలు తెస్తున్నట్టున్నారు
కాకాణి అరిచినా, కరిచినా, మొరిగినా మాకు సంబంధం లేదు..సర్వేపల్లి అభివృద్ధి విషయంలో రాజీపడబోము