logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువతిని మోసం చేసిన ఇద్దరు అరెస్ట్, రిమాండ్ బాధితురాలి వద్దనుండి 50,000 డిమాండ్, రూ 15,000 వసూలు.

పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్
మార్చి 12 :-


జాబ్ పేరుతో మోసం చేసే వారి పట్ల కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిక.

గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు, రిమాండ్ తరలింపు.

ఆదివాసీ నాయకులం అంటూ మోసం చేసిన నిందితులు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

ఇంకా బాధితులు ఎవరైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చు.

గుడిహత్నూర్ ఎస్సై ఎల్ శ్రీకాంత్.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువతిని మోసం చేసి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితులను గుడిహత్నూర్ ఎస్ఐ ఎల్ శ్రీకాంత్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గుడిహత్నూర్ మండలం సీతగొండి గ్రామానికి చెందిన ఓ యువతిని ఈ ఇద్దరు నిందితులు ఆదివాసీ నాయకుల పేరుతో, తమకు ఉన్న పరిచయాలతో, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.

ఈ కేసులో నిందితులు
A1) ఆత్రం గణపతి @ గుణవంత్ (53) s/o రాజు, నివాసం: మావల గ్రామం, ఆదిలాబాద్ జిల్లా.
A2) సలాం వరుణ్ (27) @ సలాం ఆరుణ్ కుమార్ s/o దాము, ఆదివాసి స్టూడెంట్ యూనియన్ జిల్లా సెక్రటర్, నివాసం: రామ్నగర్, ఆదిలాబాద్ పట్టణం.

నిందితులు ఇద్దరూ తమ పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మొదట రూ.1,00,000/- డిమాండ్ చేశారు. బాధితురాలు పేద కుటుంబానికి చెందినదని చెప్పడంతో రూ.50,000/- ఇవ్వాలని ఒప్పించారు.

ఈ క్రమంలో బాధితురాలు 2024 ఆగస్టు నెలలో రెండు విడతల్లో ఫోన్‌పే ద్వారా మొత్తం రూ.15,000/- నిందితులకు పంపింది. అనంతరం ఉద్యోగం ఇప్పించకుండా నిందితులు ఆమెను తప్పించుకుంటూ వచ్చారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు కూడా బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ శ్రీకాంత్ తెలిపారు.

ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని, ఎవరైనా ఈ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. వీరి వల్ల మోసపోయిన బాధితులు ఇంకెవరైనా ఉన్నట్లయితే వెంటనే జిల్లా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు.

0
12 views

Comment