1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమ పునాది రాళ్ళల్లో ఒకరు ఆచార్య సిద్దులు
భద్రాచలం (12.03.2026)
తొలి తరం ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కెరటం ప్రొఫెసర్ తిప్పన సిద్దులు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమ పునాది రాళ్ళల్లో ఒకరు ఆచార్య సిద్దులు. వరంగల్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో B.A. రెండవ సంవత్సరం చదువుతున్న రోజులలో NCC శిక్షణ కూడా పోదారు.
1969 లో కళాశాల జనరల్ సెక్రటరీ గా ఎన్నుకోబడ్డారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రోజు రోజుకు ఉదృతం అవుతుంది. ఈ క్రమంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడం కోసం హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఉన్న రెడ్డి హాస్టల్ లో చారిత్రాత్కమైన సమావేశం నిర్వహించారు. ఆ సమావేశనికి ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ, సదాలక్ష్మి, మర్రి చెన్నారెడ్డి, హాగ్రీవాచారి, టి. పురుషోత్తమరావు, మదన్మోహన్, డాక్టర్ గోపాలరావు, మాణిక్యరావు, అంజయ్య, నాయని నరసింహారెడ్డి మొదలైన ప్రముఖులు హాజరయ్యారు. ఆ సమావేశం లో ప్రొఫెసర్ సిద్దులు కు ఉపన్యాసించడానికి అవకాశం ఇవ్వగా.. తెలంగాణా కు జరుగుతున్న అన్యాయాన్ని మరియు ముల్కి రూల్స్ గురించి తీవ్ర స్వరం తో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
అనంతరం ఉద్యమ నాయకత్వం మర్రి చెన్నారెడ్డి కి అప్పగించడం జరిగింది. ఆ సమయంలో సిద్దులు ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం వలన 107 సెక్షన్ కింద అరెస్ట్ చేసి వరంగల్ జైలులో 15 రోజులు రెండు సార్లు నిర్భందించారు.అంతే కాదు పిడి యాక్ట్ క్రింద పురుషోత్తమరావు,హాయిగ్రీవాచారి వంటి నాయకులతో పాటు సిద్దులును జైల్లో నిర్భందించారు. ఉద్యమ సమయం లో వరంగల్ కళాశాలలో జరిగిన ఓ సంఘటనను గమనించిన కళాశాల ప్రిన్సిపాల్ మరియు స్పెషల్ ఆఫీసర్ అయిన ప్రొఫెసర్ వెంకటరామయ్య "స్వతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు గురించి చదివాను.. కాని ఇప్పుడు నీ ధైర్యాన్ని ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్య పోతున్నాను" అని సిద్దులు గురించి వ్యాఖ్యనించారు.1969 ఉద్యమ సమయంలో చెన్నారెడ్డి.. ములుగు, పొలంపేట మొదలగు బహిరంగ సభలకు సిద్దులు ని అధ్యక్షత వహింపచేశారంటే ఆచార్య సిద్దులు గురించి ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు.
ఆ తరం లో సిద్దులు ని ఎన్నో ఉన్నత పదవులు వారించినా తృణ ప్రాయంగా త్యజించారు. "సిద్దులు ఇప్పుడు ఉద్యమంలోంచి విసిరి పారేసిన అతడు బండ మీద పడినా ఆ బండను రుద్ది నీటిని సృష్టిస్తాడు "అని చెన్నారెడ్డి అన్నారంటే ప్రొఫెసర్ సిద్దులు గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ లాంటి తొలి తరం తెలంగాణ యోధుడు (80 సంవత్సరాల వయస్సు )కి ఈ తరం తెలంగాణా ఎ గౌరవం ఇచ్చి ఋణం తీరుకుంటుందో వేచి చూద్దాం