logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బోథ్ నియోజకవర్గ కిడ్నీ బాధితుల కొరకు రూ. 50 లక్షలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు



బోథ్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు

రోగులను పలకరించి - ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని

బోథ్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా మంజూరు అయిన డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కొరకు రూమ్ లను పరిశీలించిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు మాట్లాడుతూ... నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులకు సౌకర్యార్థం బోథ్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో గల రోగులతో మాట్లాడి నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రూ. 50 లక్షలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని కిడ్నీ బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. త్వరలోనే CHC భవనం కూడా అందుబాటులోకి వస్తుందని ఎవరు కూడా పట్టణాలకు వెళ్లే పరిస్థితి రాదని తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

0
0 views

Comment