విధులతో పాటు మానసిక ఉల్లాసం తప్పనిసరి.
సిబ్బంది శారీరక దృఢత్వం పై దృష్టి సారించాలి.
పోలీసు సిబ్బంది అధికారులకు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్.
పత్రికా ప్రకటన
అదిలాబాద్ జిల్లా,
మార్చి 11 :-
విధులతో పాటు మానసిక ఉల్లాసం తప్పనిసరి.
సిబ్బంది శారీరక దృఢత్వం పై దృష్టి సారించాలి.
పోలీసు సిబ్బంది అధికారులకు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నూకర్ మరియు టేబుల్ టెన్నిస్ క్రీడలు.
హెడ్ క్వార్టర్స్ లో ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణం ప్రారంభం.
స్వయంగా సిబ్బందితో స్నూకర్ మరియు టేబుల్ టెన్నిస్ ఆడి ఉత్సాహపరచిన జిల్లా ఎస్పీ
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ జిల్లా పోలీసు సిబ్బంది విధుల్లో నిత్యం ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న నేపథ్యంలో, వారి శారీరక దృఢత్వం మరియు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈరోజు శాస్త్రక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది రోజువారీ విధుల్లో అనేక సవాళ్లు ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో శారీరక వ్యాయామం, క్రీడలు మరియు వినోదాత్మక కార్యక్రమాలు సిబ్బందికి మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా వారి పనితీరును కూడా మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.
పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా స్నూకర్ మరియు టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ క్రీడలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రీడల ద్వారా సిబ్బంది విధుల అనంతరం కొంత సమయం క్రీడల్లో పాల్గొని శారీరక దృఢత్వం మరియు మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని అన్నారు.
అదేవిధంగా, ఇలాంటి సౌకర్యాలు సిబ్బంది మధ్య స్నేహభావం, ఐక్యత మరియు ఉత్సాహాన్ని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో స్వయంగా ఆడి ఉత్సాహపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని, ఇండోర్ స్పోర్ట్స్ సదుపాయం కల్పించినందుకు జిల్లా ఎస్పీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, ఎఎస్పి పి మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్ర వర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు జిల్లా పోలీస్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.