తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మరియు మహిళా & శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ప్రీ-బడ్జెట్ సమీక్ష సమావేశం
హైదరాబాద్, 11మార్చి 2026
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మరియు మహిళా & శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ప్రీ-బడ్జెట్ సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిర్వహించారు.
రాబోయే రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో ఈ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, మహిళలు మరియు చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు . ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో సహచర మంత్రి దనసరి సీతక్క మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.