logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అదిలాబాద్ లో ఆవిష్కర్తలకు అండగా మార్చి 14న 'ఇన్నోవేషన్ పంచాయత్' కార్యక్రమం చేయనున్న తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (TGIC)!*

*FOR IMMEDIATE RELEASE*
*
*తెలంగాణ – మార్చి 11, 2026* – రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు, అంకురాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (TGIC), విజయవంతమైన ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతానికి విస్తరిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులను ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఉ.10గంటలకు మార్చి 14, 2026 శనివారం నాడు అదిలాబాద్ కలక్టర్ ఆఫీసులోని కాన్ఫిరెన్సు హాల్లో జరగనుంది. అదిలాబాద్ మరియు అసిఫాబాద్ జిల్లాల నుండి ఆవిష్కర్తలను, వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.

‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమం ఆవిష్కర్తలకు, వారికి అవసరమైన తోడ్పాటుకు మధ్య ఉన్న భౌగోళిక దూరాన్ని తగ్గించడానికి రూపొందించిన ఒక ప్రత్యేకమైన వేదిక. తమ ఆలోచన, ఆవిష్కరణ లేదా పారిశ్రామిక ప్రయాణం గురించి సందేహాలు ఉన్న ఏ వ్యక్తికైనా, రాష్ట్రంలోని వ్యవస్థాపక నిపుణుల నుండి వ్యక్తిగత, మార్గదర్శకత్వం మరియు సలహాలు పొందేందుకు ఇది ఒక గొప్ప అవకాశం.

రాష్ట్ర రాజధాని వెలుపల ఉన్న వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలకు వనరులు సమానంగా అందుబాటులో ఉండేలా, తక్షణ మరియు స్పష్టమైన సహాయాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాము. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు, నిపుణులతో నేరుగా చర్చించవచ్చు. వ్యాపారం లేదా సాంకేతిక సవాళ్లను అక్కడికక్కడే (on-the-spot) పరిష్కరించడానికి మార్గదర్శకత్వం, ఆలోచన ధ్రువీకరణ (idea validation), నమూనా అభివృద్ధి (prototype development), వ్యాపారాన్ని విస్తరించే (scaling) ప్రక్రియపై సలహాలు, మరియు ప్రభుత్వ కార్యక్రమాలు, ఇంక్యుబేషన్ సహాయాన్ని నేరుగా పొందడానికి కనెక్షన్‌లను సులభతరం చేసే అవకాశం ఉంటుంది.

అంకురాలకు మద్దతుగా, సమ్మిళిత వాతావరణాన్ని నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం బలపరుస్తుంది. కాబట్టి, ఈ జిల్లాల నుండి వచ్చిన ఆవిష్కర్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని కోరుతున్నాము. కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు, ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోండి.

*తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ గురించి*
తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ విభాగం ద్వారా స్థాపించబడిన ఒక చొరవ. స్టేట్ ఇన్నోవేషన్ పాలసీ కింద 2017లో రూపొందించబడిన తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ రాష్ట్రంలో ఆవిష్కరణలను ప్రోత్సహించి, వాటిని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో కీలక పాత్రధారులుగా ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు మరియు ఆవిష్కరణ ఉత్ప్రేరకాలుగా ప్రాధాన్యతనిచ్చే సమగ్ర విధానంతో విభిన్నమైన ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థకు మద్దతునిస్తుంది.

1
58 views

Comment