కామారెడ్డి జిల్లా బుధవారం
వాటర్ ట్యాంక్ ఎక్కి వాటర్ ట్యాంక్ శుభ్రతను పరిశీలించి వర్కర్లను అభినందించి సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్.
నిజామాబాద్ ప్రతినిధి (పాముల సంతోష్ కుమార్)
తేది:11.03.2026
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా బుధవారం జిల్లా లోని సదాశివ నగర్ మండలంలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కి తనిఖీ చేసి పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్న కార్మికులతో మాట్లాడారు.
సదాశివ నగర్ 1వ వార్డు, OHSR ట్యాంక్ సామర్థ్యం: 90 KL
పనిచేసిన కార్మికులు
ఎల్లగారి భుచ్చయ్య
పోట్నగారి ప్రవీణ్ లు
పరిశుభ్రత పనులను సమర్థవంతంగా నిర్వహించిన వారిని జిల్లా కలెక్టర్ అభినందించి వారిని సన్మానించారు. గ్రామాలలో పరిశుభ్రత, తాగునీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకుల శుభ్రతను తరచూ నిర్వహించాలని, పంచాయతీ సిబ్బంది , కార్మికులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంకాయల శిరీష రవి, ఉప సర్పంచ్ కుందెన ప్రవీణ్ కుమార్, వార్డ్ మెంబర్లు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది,
CEO చందర్, ప్రత్యేక అధికారి సతీష్, dlpo శ్రీనివాస్, పంచాయతీ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.