logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కొవ్వూరులో 15వ తేదీన నూకాంబికా మహోత్సవం .

రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాంబికా మహోత్సవ వేడుకలు మార్చి 15న అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన నూకాలతల్లి పండుగ ప్రతి సంవత్సరం సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది. తెల్లవారు 3:30 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయం వద్ద భారీ అన్నసమర్పణ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం హరిభజనలు, తప్పిడుగులతో ఊరేగింపు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి భారీ మందు గుడి సామగ్రి పేల్చి, రాత్రి 9 గంటలకు స్టేజి ప్రోగ్రాం నడుస్తుంది. కమిటీ నిర్వాహకులు బంటు రాజు, కోలిపల్లి ఈశ్వరరావు, ఆలయ పూజారి కొట్టే లక్ష్మి, వివేకానంద యూత్ తెలిపారు. పిల్లలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని సాంస్కృతిక సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్నారు.

0
156 views

Comment