అంజుమన్ ఆధ్వర్యంలో ఉచిత ముస్లీం సాముహిక వివాహాలు: నశ్యం అబ్దుల్ ఖుద్దూస్.
నంద్యాల (AIMA MEDIA): అంజుమన్ సంస్థ ముస్లిం సమాజం కోసం పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించటం, పేద ముస్లీం యువతులకు ఉచిత సామూహిక వివాహాలు ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు చేయడం విదితమే. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఏప్రేల్ 19, ఆదివారం పేద ముస్లిం యువతులకు సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో నివసిస్తూ అంజుమన్ షాది ఖానా లో సామూహిక వివాహాలు చేయదలచిన పేద ముస్లిం వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలు ఉన్నవారు దరాఖాస్తు చేసుకోవచ్చన్నారు. అంజుమన్ షాది ఖానాలో ఉచిత దరాఖాస్తులు పొంది, వధువరుల ఆధార్, రెండేసి పాస్ పోర్ట్ ఫోటోలు, అమ్మాయి బ్యాంక్ పుస్తకం జిరాక్స్ కాపీలు జత చేసి 12,ఏప్రేల్ 2026 లోపు అంజుమన్ ఆఫీసులో దరాఖాస్తు చేసుకోవాలని, సామూహిక వివాహాలు 19 ఏప్రెల్ 2026, ఆదివారం ఉంటాయని ఖుద్దూస్ తెలిపారు. నిఖా ఖర్చులు భరించి వధువుకు రూ.50,000/- నగదు చెక్కు వివాహం రోజే బహూకరించునున్నట్లు అంజుమన్ అధ్యక్షులు ఖుద్దూస్ తెలిపారు. ఈ సమాచారం మస్జిద్ మాములు, ప్రజా సంఘాలు విస్తృతంగా ప్రచారం చేయాలని అంజుమన్ కమిటి కోరింది. పేద ముస్లీం తల్లితండ్రులు తమ పిల్లలకు సాముహికంగా వివాహాలు చేయుటకు ముందుకు రావాలని అంజుమన్ ఆహ్వానిస్తుంది.