logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఎంజిఆర్ గారు...

*▪️అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఎంజిఆర్ గారు...*

*▪️ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే ఎంజిఆర్ గారు...*

*▪️పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు అధికారులకు ఆదేశించారు.పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ, డి.పి.ఓ గారు మరియు,డి.ఈ, ఏ.ఈ లతో పాటు ఐటిడిఏ శాఖ డి.ఈ, ఏ.ఈ. లు, ఏపీఎం, లతో ఎమ్మెల్యే గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు వివరాలు అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేసి వినియోగానికి అందించాల్సిందిగా సూచించారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే గారు తెలిపారు.నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.*

1
163 views

Comment