logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రష్యా ఆయిల్ విషయం లో అమెరికా వత్తిడికి భారత్ లొంగిపోయింది.

మీకు తెలుసా?

2012లో అమెరికా వత్తిడికి మరియు బెదిరింపులకు భయపడి సోనియా మరియు రాహుల్ ప్రభుత్వం ఇరాన్ నుండి ఆయిల్ కొనుగోళ్లు భారీగా తగ్గించింది.

ఇప్పుడే ఇదే రాహుల్ రష్యా ఆయిల్ విషయం లో అమెరికా వత్తిడికి భారత్ లొంగిపోయింది అని కధలు చెపుతున్నాడు.

2021 వరకు గతంలో ఎప్పుడూ మన దేశం 2-3% శాతం కంటే రష్యా ఆయిల్ దిగుమతి చేసుకునేది కాదు. కారణం దూరం వల్ల, స్టాక్స్ రావడానికి 4 వారాలు పట్టడం ఆపై అంతమేరా రవాణా ఛార్జీల భారం పెరగడం. నిజానికి అమెరికా 3సం.లుగా వత్తిడి తెస్తున్నా, రష్యా భారీ డీస్కౌంట్ ఇస్తోంది అని చెప్పి భారత్ రష్యా ఆయిల్ దిగుమతులు పెంచుకుంటూ పోయింది. 2021లో కేవలం 2% లోపు ఉండే దిగుమతులు 2025 వచ్చేసరికి సుమారు 35% వరకు పెంచుకుంటూ పోయింది.

ఇక్కడే విచిత్రం.

ఇలా మోడీ ప్రభుత్వం నమ్మకమైన గల్ఫ్ నుండి ఆయిల్ దిగుమతులు తగ్గిస్తూ రష్యా నుండి ఆయిల్ దిగుమతులు పెంచుకోవడం దేశానికి చాలా ప్రమాదం అని ఇదే కాంగ్రెస్ 2023లో చాలా తీవ్రంగా విమర్శలు చేసింది. మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ భారత్ రష్యా నుండి ఆయిల్ దిగుమతులు తగ్గిస్తోంది అని వెక్కిరిస్తోంది.

ఇక్కడ ఒక ముఖ్యమైన సంగతి గమనించాలి.
ఇది వ్యాపారం. అన్ని ఖర్చులు కలుపుకున్న తర్వాత డిస్కౌంట్స్ తర్వాత ఎక్కడ చవగ్గా వస్తే అక్కడ నుండి దిగుమతి చేసుకుంటాం.

భారత్ కి రష్యా ఉన్న దూరం వల్ల రష్యా నుండి ఆయిల్ ట్యాంకర్ షిప్స్ భారత్ రావడానికి సుమారు నెల రోజులు పడితే, గల్ఫ్ నుండి ఒక వారంలో వచ్చేస్తాయి. అందుకని గల్ఫ్ నుండి వచ్చే ఆయిల్ నౌకలు అద్దెతో పోలిస్తే రష్యా నుండి వచ్చే ఆయిల్ నౌకల అద్దె 4 రెట్లు ఎక్కువ ఉంటుంది.

అంటే రష్యా మనకు ఇచ్చే డీస్కౌంట్ ఈ రవాణా ఛార్జీల కంటే ఎక్కువ ఉంటేనే మనకు రష్యా ఆయిల్ దిగుమతులు లాభం లేకుంటే గల్ఫ్ దేశాల నుండి ఆయిల్ తెచ్చుకోవడం చవకపడుతుంది.

యుక్రెయిన్ యుద్ద పీక్ సమయంలో, అమెరికా యూరోప్ సాంక్షన్స్ నేపథ్యంలో యూరోప్ కి ఆయిల్/గ్యాస్ అమ్మకాలు చేసుకోలేక, నిధుల కొరత వల్ల రష్యా తమకు భారీగా నిధులు అవసరం పడి భారత్ కి భారీ డీస్కౌంట్ తో ఆయిల్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.

2021 వరకు అంతకు ముందు తన ఆయిల్ పై భారత్ కి డీస్కౌంట్ ఎప్పుడూ ఇవ్వని రష్యా 2021లో భారీ డిస్కౌంట్ ప్రకటించడానికి మన దేశం మీద ప్రేమ కాదు. వాళ్ళ నిధుల అవసరాల కోసం మాత్రమే. అందరికి వారి దేశ ప్రయోజనాలు ముఖ్యం.

అయితే 2025 తర్వాత ట్రంప్ వచ్చాక రష్యా మీద అమెరికా, యూరోప్ సాంక్షన్స్ వత్తిడి నేపధ్యంలో రష్యా నుండి ఆయిల్ తీసుకువచ్చే ఆయిల్ ట్యాంకర్స్(షిప్స్) రవాణా ఛార్జీలు భారీగా అంటే సుమారు మూడు రెట్లు పెరిగిపోయాయి. దీని వల్ల రష్యా మనకు డీస్కౌంట్ ఇచ్చినా, ముందుగా చెప్పుకున్న దూరం వల్ల రవాణా చార్జీలు మరియు ఇప్పుడు సాంక్షన్స్ వల్ల ఇంకా పెరిగిన రవాణా ఛార్జీల వల్ల గల్ఫ్ ఆయిల్ కి రష్యా ఆయిల్ కి ధరలో తేడా బాగా తగ్గిపోయింది. అందుకని 20025 నుండి భారత్ మళ్ళీ గల్ఫ్ లో సౌదీ నుండి దిగుమతులు పెంచుతూ రష్యా నుండి దిగుమతులు తగ్గించుకుంటూ వస్తోంది. ఇప్పుడు కూడా మన దిగుమతులలో 20%తో రష్యా మొదటి స్థానంలో ఉంది.

కానీ రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాలు మనకు ఏ మాత్రం డీస్కౌంట్ ఇచ్చినా రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవడం మనకు కిట్టదు.

అందువల్ల అంతర్జాతీయ ఆయిల్ ధరలు, రవాణా సదుపాయాలు, రవాణా చార్జీలు, రవాణా టైం, గల్ఫ్ లో పరిస్థితులు ఇవన్నీ చూసి రష్యా ఆయిల్ కొనాలా లేక గల్ఫ్ ఆయిల్ కొనాలా లేదా ఆఫ్రికా ఆయిల్ కొనాలా అనేది ధర/సెక్యూరిటి మీద ఆధారపడి డిసైడ్ చేస్తారు. అంతే కానీ ట్రంప్ చెప్పాడు అప్పలమ్మ చెప్పింది అని వెంటనే ఆపరు.

ఎందుకంటే గతంలో మన దేశం రష్యా నుండి S400 మిసైల్ సిస్టం దిగుమతి చేసుకుంటే భారత్ మీద సాంక్షన్స్ పెడతామని అమెరికా బెదిరించింది. అయినా భారత్ లక్ష్య పెట్టకుండా అనుకున్న మూడు S-400 దిగుమతి చేసుకుంది. గతవారం మరో 5 S-400 కొనడానికి నిర్ణయం తీసుకుంది.

అంటే ఇక్కడ నిర్ణయాలు దేశానికి ఏది ఉపయోగమో దాని ఆధారంగా ఉంటాయి, అంతేకాని, సిద్ధాంతాలు ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు.
(సేకరణ)

0
983 views

Comment