logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*రాత్రిపూట ఇళ్ల చోరీల కేసులో 5 గురు నేరస్థులను అరెస్ట్ చేసిన పోలీసులు *

౮రాత్రిపూట ఇళ్ల చోరీల కేసులో 5 గురు నేరస్థులను అరెస్ట్ చేసిన పోలీసులు *

₹51 లక్షల విలువ గల 255 గ్రాములు బంగారు, సుమారు 2 కేజీల వెండి, 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ G. బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం, కాకినాడ సబ్ డివిజన్ ASP శ్రీ పాటిల్ దేవరాజ్ మనిష్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో పిఠాపురం సర్కిల్ పరిధిలో మరియు ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో గత సంవత్సర కాలంగా జరుగుతున్న రాత్రిపూట ఇంటి దొంగతనాల కేసులను డిటెక్ట్ చేయాలన్న ఉత్తర్వులపై పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ G. శ్రీనివాసు గారు వారి సర్కిల్ ఎస్సైలు, క్రైమ్ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్లో సిబ్బందితో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ముద్దాయిల గురించి ఆచూకీ తెలుసుకొని
ది. 8-03-2026 వ తేదిన గొల్లప్రోలు SI గారికి రాబడిన సమాచారం మేరకు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ కేసు లో పిఠాపురం టౌన్ రైల్వేస్టేషన్ రోడ్డు నందు ఒక లాడ్జి రూమ్ లో ఉన్న 5 గురు ముద్దాయి లను గుర్తించి వారిని అరెస్ట్ చేసినారు.
వారి పేర్లు :-
1. వల్లి లక్ష్మణ్ కుమార్ S/O శ్రీనివాస్, A/30 సం ", C/శెట్టిబలిజ, రాజేంద్రనగర్, గైగోలు పాడు, కాకినాడ, ప్రస్తుతం తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామం.
2. విత్తనాల దుర్గా ప్రసాద్ S/O తాతా రావు, A/39 సం ", C/శెట్టి బలిజ కిర్లంపూడి గ్రామం మరియు మండలం. ప్రస్తుతం రాయుడు పాలెం, APSP వెనుక, కాకినాడ.
3. మజ్జి నరేంద్ర కుమార్ S/O లేటు శంకరరావు A/ 34 సం ", C/రెడ్డి, శ్రీనివాస్ అపార్ట్మెంట్, ఒలేటి వారి వీధి, కాకినాడ. ప్రస్తుతం ప్రతాప్ నగర్ లో నివాసం ఉంటున్నాడు.
4. వల్లి రామ్ కుమార్, S/O శ్రీనివాస్, A/30 సం " C /శెట్టి బలిజ, రాజేంద్రనగర్, గైగులపాడు, కాకినాడ ప్రస్తుతం నీలపల్లి గ్రామం, తాళ్లరేవు మండలం.
5. బీర సింహాచలం S/O నరసింహ మూర్తి (లేటు) A/35 సం " C/ శెట్టి బలిజ అంబేద్కర్ కాలనీ గైగులు పాడు, కాకినాడ.
పై ఐదుగురు ముద్దాయిలు కొరింగ, పెద్దాపురం, తిమ్మాపురం, ప్రత్తిపాడు పిఠాపురం రూరల్, పిఠాపురం టౌన్, U. కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ల పరిధిలో తాళం వేసిన ఇండ్ల లో పగటి పూట రెక్కి చేసి రాత్రి వేళలో సదరు ఇంటి వద్ద హౌస్ లాక్ బ్రేకింగ్ నేరం లకు పాల్పడుతూ బంగారం మరియు వెండి వస్తువులను దొంగతనం చేసినారు. అంతే కాకుండా వాటితో పాటు గొల్లప్రోలు, పిఠాపురం టౌన్, పిఠాపురం రూరల్ మరియు U. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రదేశంలలో మోటార్ సైకిల్ నేరం లకు పాల్పడినారు.
సదరు నేరములలో మొత్తం
సుమారు 255.1 గ్రాములు బంగారు వస్తువులను,
సుమారు 1760 గ్రాములు వెండి వస్తువులను వారి వద్ద నుండి రికవరీ చెయ్యడం జరిగినది.
అదే విధంగా వారి వద్ద నుండి " 7 " కేసు లలో " 9" మోటార్ సైకిల్ లను మరియు నేరం చేసిన సొమ్ము తో కొనుగోలు చేసి నేరం చెయ్యు సమయంలో ఉపయోగించిన ఆటో ను కూడా రికవరీ చెయ్యడం జరిగినది.
రికవరీ సొత్తు వివరాలు:
1. బంగారం 255 గ్రాములు
2. వెండి 1760 గ్రాములు
3. మోటార్ సైకిల్లు ( 9 ద్విచక్ర వాహనాలు)
సారీ సొత్తు విలువ సుమారుగా 51,00,000/- లక్షలు.
పత్రికా ప్రకటన
జిల్లా పోలీసు కార్యాలయం, కాకినాడ.
ది 09-03-2026

0
0 views

Comment