మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మాతంగి అంబేద్కర్ సామాజిక కార్యకర్త
కోదాడ నుంచి తాడువాయి వరకు మహిళల నాయకత్వం శుభపరిణామం
మహిళా శక్తి అభివృద్ధికి బాటలు వేస్తోంది: మాతంగి అంబేద్కర్
సూర్యాపేట జిల్లా: సమాజ అభివృద్ధికి మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, మహిళలు అధికారం లోకి రావడం శుభపరిణామమని సామాజిక కార్యకర్త మాతంగి అంబేద్కర్ అన్నారు. “ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు”, “మహిళల అధికారం – అభివృద్ధికి సోపానం” అనే నినాదాలు నేటి సమాజంలో నిజమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
కోదాడ నియోజకవర్గం నుంచి తాడువాయి గ్రామపంచాయితీ వరకు మహిళలు కీలక పదవుల్లో బాధ్యతలు చేపట్టడం పట్ల సూర్యాపేట జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మహిళలు ప్రజా సేవలో ముందుకు వచ్చి నాయకత్వం వహించడం సమాజ అభివృద్ధికి మంచి సంకేతమని అన్నారు.
ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత, వైస్ చైర్మన్, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి, కోదాడ మార్కెట్ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుదీర్, కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్ననేని కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, మునగాల మండలానికి చెందిన నల్లపాటి ప్రమీల శ్రీనివాస్, తాడువాయి గ్రామ సర్పంచ్ కొలిశెట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య వంటి మహిళా ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.
అందరి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటామని మహిళా ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారని చెప్పారు. విద్య, వైద్యం, ఆర్థిక అభివృద్ధి వంటి రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తామని వారు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ సూర్యాపేట జిల్లాను అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందంజలో నిలిపేలా అందరూ కలిసి పనిచేయాలని ప్రజలను మాతంగి అంబేద్కర్ కోరారు.