అద్భుత కళాఖండం
శ్రీ రాజ రాజ చోళుడు 1010 CE లో నిర్మించిన అద్భుత కళాఖండం తంజావూరు (తమిళనాడు) లోని
శ్రీ బృహదీశ్వరాలయం. ఆ నాటి శిల్ప కళా చాతుర్య విశేషం,ఆలయ గోపురం నీడ ఎక్కడా పడక పోవటం. పెద్ద శివలింగం, ఏకశిలా నందీశ్వరుని విగ్రహం మరో విశేషం.
దాదాపు 216 అడుగుల విమానం ఆకాలంలో ఎలా నిర్మించారో.
80 టన్నుల ఏకశిలా కుంభం, ఇలా ఎన్నో విశేషాలతో కూడిన అద్భుతమైన ఆలయం.