logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాజాం శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా హ్యాపీ సండే కార్యక్రమం

రాజాం: హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా రాజాం లోని శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ఆదివారం యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రరావు పాల్గొని విద్యార్థులు, యువత ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ యోగా చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం శ్రీ విద్యానికేతన్ కరస్పాండెంట్ గట్టి పాపారావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. యోగా సాధన శారీరక-మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు.
పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని యోగా ఆసనాలు చేశారు. కార్యక్రమం అనంతరం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు వాకిచర్ల పైడిరాజు, గడే అప్పలనాయుడు, పాలవలస రాంబాబు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

1
645 views

Comment