logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నదమ్ముల సివిల్స్ విజయం

అన్నదమ్ముల సివిల్స్ విజయం…..గ్రామం నుంచి జాతీయ స్థాయికి..వెలిమినేటి విక్రమ్ సింహా రెడ్డి & వెలిమినేటి విజయసింహ రెడ్డి....

తమ్ముడు విక్రమ్ సింహా రెడ్డి ఆలిండియా 541వ ర్యాంకు సాధించగా, అన్న విజయసింహ రెడ్డి 682వ ర్యాంకు దక్కించుకున్నారు...

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకనపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు సివిల్స్ ఫలితాల్లో ప్రతిభ చాటుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు. వెలిమినేటి అంజిరెడ్డి, అలివేలు దంపతుల కుమారులు వేలిమినేటి విక్రమసింహారెడ్డి, విజయసింహారెడ్డి ఇద్దరూ యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించారు..

ఇద్దరూ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి చిన్నప్పటి నుంచే సివిల్స్ లక్ష్యంగా కృషి చేశారు...వీరిద్దరూ గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలి సివిల్స్ వైపు మొగ్గు చూపారు. విశేషమేమిటంటే, వీరిద్దరూ ఇటీవల తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో కూడా ఎంపికయ్యారు.

ఇటీవల నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో కూడా ఇద్దరూ మెరుగైన ప్రతిభకనబరిచారు.
విక్రమసింహారెడ్డి గ్రూప్–1లో 208వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించగా, విజయసింహారెడ్డి 340వ ర్యాంక్ సాధించి మహబూబ్‌నగర్‌లో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు....

0
0 views

Comment