ప్రతి తల్లి తండ్రి పిల్లలను పద్దతిగా పెంచండి......
👉 2025వ సంవత్సరం 11 నెల 12వ తేదీన సురేష్ అనే గుడిపల్లి వాసి సోమందేపల్లిలో ఒక మొబైల్ షాప్ నడుపుతూ ఉదయం గుడిపల్లి నుండి వచ్చి సాయంత్రము 8 గంటలకు ఇంటికి వెళ్ళేవాడు.
👉 సోమందేపల్లిలోనే ఆకతాయిగా తిరుగుతూ తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలోపించిన యువకులు నాగార్జున రెడ్డి,ప్రేమ కుమార్,నంద అనే ముగ్గురు 12.11.2025 న రాత్రి గుడిపల్లి పాపిరెడ్డిపల్లి జనావాసం లేని చోట కాపు కాసి అతనిపై కారం పొడి చల్లి అతని వద్ద ఉన్న డబ్బు కాజేయాలని చూశారు.అంతలో సురేష్ గట్టిగా అరుస్తూ పాపిరెడ్డిపల్లికి పరుగెత్తగా వీరు ముగ్గురు కూడా ఎక్కడా దొరికిపోతామో అని తుంగొడు వైపుగా పారిపోయారు.
👉 సదరు సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై 120/2025 కేసు నమోదు చేసి పై ముగ్గురిని ఈరోజు రిమాండ్ కి పంపగా గౌరవ కోర్టు వారు ఈ నెల 19 వరకు పెనుకొండ జైలుకు పంపారు.
ముద్దాయిల వివరాలు
1.జి. నాగార్జున రెడ్డి, వయస్సు 24 సం., s/o సుబ్బారాయుడు, చాకర్లపల్లి గ్రామం, సోమందేపల్లి మండలం
2.C.ప్రేమ్ కుమార్, వయస్సు 22 సం., s/o బాల స్వామి, మారుతి
నగర్, సోమందేపల్లి మండలం
3.బి. నందా, వయస్సు 22 సం., s/o భాస్కర్, శివా నగర్, సోమందేపల్లి గ్రామం మరియు మండలం.
👉పత్రికా ముఖంగా తెలుపునది ఏమనగా ప్రతి తల్లి తండ్రి పిల్లలను పద్దతిగా పెంచండి.వీరే కాదు ఇంకా కొంత మంది కష్ట పడకుండా ఆకతాయిగా తిరుగుతూ ఇలాంటి పనులు చేయాలని చూస్తున్నారు,ఇలా చేస్తే జైలుకే పోతారు తప్పా జీవితం ఏమి ఉండదని హెచ్చరిస్తున్నాను.