నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన వెంకటగిరి ప్రభుత్వ జడ్పీ పాఠశాల విద్యార్థినులు.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
- నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన వెంకటగిరి ప్రభుత్వ జడ్పీ పాఠశాల విద్యార్థినులు.
- రోడ్డుపై దొరికిన సుమారు 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణం మరియు నగదును పోలీసుల ద్వారా పోగొట్టుకున్న బాధితులకు చేర్చిన విద్యార్థినులు.
- చిన్న వయసులోనే గొప్ప నిజాయితీని చాటిన విద్యార్థినులను అభినందించి ప్రశంసాపత్రాలు, పుస్తకాలు మరియు నగదు బహుమతి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు.
- తిరుపతి జిల్లా 07: వెంకటగిరి జడ్పీ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థినులు గురువారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం వెంకటగిరి ఎస్బీఐ బ్యాంకు వద్ద మన్నవరం బస్సు కోసం నిరీక్షిస్తున్న సమయంలో కొత్తపల్లి గుంటకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు బి. గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతిక, 6వ తరగతి విద్యార్థిని పద్మజ, 7వ తరగతి విద్యార్థిని హేమలతలకు ఒక పర్సు కనిపించింది. ఆ పర్సులో బంగారు ఆభరణాలు, నగదు మరియు ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు ఉండటాన్ని గమనించిన విద్యార్థినులు వెంటనే ఆ పర్సును వెంకటగిరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.
- అనంతరం పోలీసుల ద్వారా బాధితులను గుర్తించి ఆ ఆభరణాలు, నగదు అందజేశారు