logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి ప్రతినిధి( పాముల సంతోష్ కుమార్) 07-03-2026

​శ్రీ సంత్ సేవలాల్ మహరాజ్ 287వ జయంతి ఉత్సవాలు,
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ

​ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని, గిరిజన సోదరీమణులతో కలిసి నృత్యం చేసి వారిలో ఒకరిగా కలిసిపోయారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ....

​బంజారా భవన్ మరియు స్థల సమస్యల పరిష్కారం చేస్తానుఅని

​ప్రభుత్వం తరపున బంజారా భవన్ నిర్మాణం కోసం ఇప్పటికే ఒక ఎకరం స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ స్థలానికి సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతర అడ్డంకులు ఉంటే, వాటన్నింటినీ స్వయంగా పర్యవేక్షించి త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు.

అంతేకాకుండా, ఈ భవనానికి రక్షణగా అవసరమయ్యే ప్రహరీ గోడ (Boundary Wall) నిర్మాణానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు.

​"నాకు ఆధ్యాత్మిక గురువులు రామారావు మహారాజ్ గారితో ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది. వారిపై ఉన్న గౌరవంతోనే ఈరోజు వారి మనుమడితో కూడా అదే రీతిలో సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తున్నాను. బంజారా సమాజంతో నాకున్నది కేవలం రాజకీయ సంబంధం కాదు, అది ఒక కుటుంబ అనుబంధం."

​మీ సమస్యలకు నేనున్నాననే భరోసా
​"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాల సలహాదారుగా నియమించారు. కాబట్టి గిరిజన బిడ్డలైన మీ సమస్యలు ఏవైనా నా దృష్టికి తీసుకురండి. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి లభించాల్సిన ప్రతి సాయాన్ని మీకు అందేలా చూస్తాను.

నా శక్తి వంచన లేకుండా మీ సంక్షేమం కోసం కృషి చేస్తానని మాట ఇస్తున్నాను.

​కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
మాజీ​ఎమ్మెల్సీ: రాములు నాయక్,
​నాయకులు: మల్లికార్జున్ (డిసిసి అధ్యక్షులు), కైలా శ్రీనివాసరావు (మాజీ డిసిసి అధ్యక్షులు),
​ప్రజా ప్రతినిధులు: చంద్రకాంత్ రెడ్డి (గ్రంధాలయ చైర్మన్), చంద్రకరణ్ రెడ్డి (పిసిసి జనరల్ సెక్రెటరీ)
​స్థానిక నేతలు: ఉమారాణి శ్రీనివాస్ (మున్సిపల్ చైర్మన్), ఐరేని సందీప్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, భీమ్ రెడ్డి, గణేష్ నాయక్, మోతిలాల్, నవసిలాల్ నాయక్, సధనాయక్ మరియు ఇతర కాంగ్రెస్ కౌన్సిలర్లు.

22
3526 views

Comment