ఆయా ప్రాజెక్ట్ లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను త్వరితగతిన పంపించాలి*
👆👆
*ఆయా ప్రాజెక్ట్ లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను త్వరితగతిన పంపించాలి*
- *: జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్*
- *జిల్లాలో ఆయా ప్రాజెక్ట్ లకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను త్వరితగతిన పంపించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ఐసి భవనం నుంచి జాతీయ రహదారులు, రైల్వే, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, తదితర అంశాలపై సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.*
- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, భూ బదలాయింపులను పెండింగ్ లేకుండా వెంటనే పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారులు, రైల్వే, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగంగా చేపట్టాలని, వాటిల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.*
- *ఈ సమావేశంలో ఎన్.హెచ్ పిడి తరుణ్, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ రియాజుద్దీన్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*