logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సబ్‌స్టేషన్లలో జరుగుతున్న పనులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలి*



*సబ్‌స్టేషన్లలో జరుగుతున్న పనులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలి*

- *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*

- *: సింగనమల మండలంలోని పెరవలి వద్ద పీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్ ప్రాజెక్ట్ పరిశీలన.. నాయనపల్లి క్రాస్ వద్ద పీఎం సూర్య ఘర్ పథకం లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్..*

అనంతపురం, మార్చి 07 :

- *జిల్లాలోని 20 సబ్‌స్టేషన్లలో జరుగుతున్న పనులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సింగనమల పరిధిలోని పెరవలి గ్రామంలో పీఎం కుసుమ్ (PM-KUSUM) పథకం కింద ఏర్పాటు చేస్తున్న 4 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మరియు మెఘా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ పనులు వేగంగా చేపట్టాలని, జిల్లాలోని 20 సబ్‌స్టేషన్లలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.*

- *అనంతరం నాయనపల్లి క్రాస్ వద్ద పీఎం సూర్య ఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పథకం ద్వారా వినియోగదారులకు మరియు ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని మరియు మరింత మందిని ఈ పథకానికి ప్రోత్సహించాలని లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.*

- *ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడిసిఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శేషాద్రి శేఖర్, ఈఈ జె.వి.రమేష్, డీఈ రఘు, తదితరులు పాల్గొన్నారు.*

1
0 views

Comment