logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం - 2026 కార్యక్రమం నిర్వహణ

*ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం - 2026 కార్యక్రమం నిర్వహణ*

- *: జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జిల్లా స్థాయిలో మహిళా దినోత్సవ కార్యక్రమం*

- *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*

అనంతపురం, మార్చి 07 :

- *ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం - 2026 కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, నగరంలోని జేఎన్టీయూలో ఉన్న నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో (ఎన్టీఆర్ ఆడిటోరియం) జిల్లా స్థాయిలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, డిఆర్డిఎ, మెప్మా, తదితర అన్ని ఇతర శాఖల విభాగాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, ఆయా శాఖల జిల్లా మరియు ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు.*

- *మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు మహిళలకు మహిళా సాధికారత, లింగ వివక్ష నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన తదితర రంగాలలో ప్రతిభ సాధించిన వారికి గౌరవ అతిథులు మరియు ముఖ్య అతిథుల ద్వారా సత్కరించడం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలను ఫలవంతంగా నిర్వహించాలని, ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.*

- *ఈ కార్యక్రమంలో భాగంగా డిఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు మెగా చెక్కు పంపిణీ చేయడం జరుగుతుందని డిఆర్డీఏ పిడి శైలజ తెలిపారు. బ్యాంకు లింకేజీ కింద 1301 కోట్ల రూపాయలను, స్త్రీనిధి రుణాలు కింద 240 కోట్ల రూపాయలు, ఉన్నతి పథకం కింద సుమారు 13 కోట్లు, పి.ఎం అజయ్ కింద 2.50 కోట్ల రూపాయల చెక్కులను, మహిళా రైతు సంఘాలకు ట్రాక్టర్ల పంపిణీ జిల్లా కలెక్టర్, ముఖ్య అతిథుల చేత పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.*

0
0 views

Comment