పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ.
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల పరిధిలోని వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోనీ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం లో భాగంగా శనివారం నాడు సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ హుస్సేన్ మరియు సచివాలయడిజిటల్ అసిస్టెంట్ సురేష్, హెచ్ఎం జానకి చేతుల మీదుగా 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడులను పంపిణీ చేశారు.దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగమల్లేశ్వర్ రెడ్డి తరఫున వీరారెడ్డి పల్లె హై స్కూల్లో పాఠశాలలోని 20మంది విద్యార్థులతోపాటు ఆయా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నటువంటి వందలాదిమంది పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను దానధర్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగిందని తెలిపారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో కృషి పట్టుదలతో ఇష్టపడి చదువుతూ ఉత్తమ మార్కులు సాధించాలని సోషల్ వెల్ఫేర్ హుస్సేన్ మరియు డిజిటల్ అసిస్టెంట్ సురేష్ పిలుపునిచ్చారు.
పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక ప్రోత్సాహకర బహుమతిగా భావించి పోటీపడి చదివి అధిక మార్కులు సాధించి తల్లిదండ్రులకు మరియు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని హెచ్ఎం జానకి సూచించారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలందరూ మంచిగా చదివి పరీక్ష ప్యాడ్డుల కొరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు ఈటుకూరు వెంకట్ ఈ ప్యాడ్లు దాతల సహాయ సహకారాలతో అందజేయడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగమల్లే శ్వర రెడ్డి మరియు కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నాగ శేఖర్, ప్రభాకర్, యాగంటి సుడు, విజయలక్ష్మి, లింగమయ్య, రేణుకా దేవి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.