logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రమాదాన్నిపొంచిఉన్న కోనరావుపేటబ్రిడ్జి

కోనరావుపేట మండల కేంద్రానికి పొంచి ఉన్న ప్రమాదం

కోనరావుపేట మండల కేంద్రాన్ని కలుపుతున్న ప్రధాన రహదారి (రోడ్డం) ప్రమాదం అంచున ఉంది తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినప్పటికీ దానికి చుట్టూ రక్షణ కవచంల ఉండాల్సిన వాల్ నిర్మించడంలో కాంట్రాక్టర్ మరియు ఆర్ అండ్ బి అలసత్వం వహించిందని విమర్శలు వస్తున్నాయి నిత్యం వేలాదిమంది ఈ రహదారిపైనే ప్రయాణిస్తూ ఉంటారు స్థానికంగా ఉండే ఉన్నత ఉద్యోగులు కావచ్చు సాధారణ ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు 28 గ్రామాల ప్రజలు తమ అవసరాల కోసం అటు పోలీస్ స్టేషన్ ,హాస్పిటల్, ఎమ్మార్వో ఎంపీడీవో, ఆఫీసులకు అవసరాల నిమిత్తం రావాల్సి ఉంటుంది కావున వేలాదిమంది ప్రయాణిస్తున్న రహదారి కొంత బాగున్నప్పటికీ ఆ రహదారిని కలుపుతూ వేసిన బ్రిడ్జి మాత్రం ప్రమాద అంచున నిలిచి ఉన్నది ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అసలు ఊహకిందని నష్టం వాటిల్లే అవకాశము ఉందని ప్రజలు వాపోతున్నారు ప్రమాదం జరిగిన తర్వాత నివారణ చర్యలు చేపట్టడమే కాదు ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన నాయకుల పైన ఉంటుందని స్థానికులు అంటున్నారు కావున ఈ బ్రిడ్జి పైన వాల్ నిర్మించి వాహనదారులకు ప్రజలకు ఊరట కలిగించాలని ప్రజలు కోరుతున్నారు లేదంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరిగినా దానికి పూర్తి బాధ్యత అధికారుల పైన ఆర్ అండ్ బి పైన నాయకుల పైన ఉంటుందని స్థానికులు స్పష్టం చేస్తా ఉన్నారు.

78
2324 views

Comment