logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హరిత హైడ్రోజన్‌తో శక్తి రంగంలో కొత్త విప్లవం: ఐఐటి ప్రొఫెసర్ జి. రంగారావు.

పాణ్యం (AIMA MEDIA ): పాణ్యం మండలం నెరవాడ పరిధిలోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “భవిష్యత్ ఇంధన వ్యవస్థల్లో గ్రీన్ హైడ్రోజన్ పాత్ర” అనే అంశంపై నిపుణుల ఉపన్యాసం నిర్వహించారు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ జి. రంగారావు ముఖ్య వక్తగా పాల్గొని గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక శక్తి నిల్వ, ఫాసిల్ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడం మరియు హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమానికి విభాగాధిపతి డా. ఆవుల బాలకృష్ణ, ప్రిన్సిపల్ డా. టి. జయచంద్ర ప్రసాద్, డైరెక్టర్ డా. అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు. ఆర్జీఎం గ్రూప్ చైర్మన్ డా. ఎం. శాంతిరాముడు మాట్లాడుతూ గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్ శక్తి అవసరాలకు ముఖ్యమని పేర్కొన్నారు.

0
24 views

Comment