logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కృష్ణదేవిపేటలో మహిళా దినోత్సవ వేడుకలు

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని మహిళలు, యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా హక్కులు, సమానత్వం, సాధికారతపై నినాదాలు చేస్తూ ప్రధాన మార్గాల్లో ర్యాలీ నిర్వహించారు.స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ మహిళలు ధైర్యంగా, బలంగా ముందుకు సాగాలని, పురుషులు వారిని గౌరవించాలని పిలుపునిచ్చారు. ప్రతి రోజూ మహిళా దినోత్సవంలా భావించి మహిళా భద్రత, హక్కుల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ యువకులు, మహిళలు అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

0
25 views

Comment