భారత్ కు రష్యా చమురు కొనుగోలుపై అమెరికా మినహాయింపు
*భారత్ కు రష్యా చమురు కొనుగోలుపై అమెరికా మినహాయింపు*
*"అక్షర అక్షయ జ్యొతి న్యూస్"
మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒత్తిడిని తగ్గించేందుకు అమెరికా భారత్కు 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. సముద్రంలో నిలిచిపోయిన రష్యా ముడి చమురు నౌకలను కొనుగోలు చేసేందుకు భారత శుద్ధి కర్మాగారాలకు అనుమతి ఇచ్చినట్లు అమెరికా ఖజానా శాఖ తెలిపింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు రష్యా నుంచి చమురు దిగుమతులను వేగవంతం చేస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లోసరఫరా అంతరాయం రాకుండా చూడడమే ఈ నిర్ణయ లక్ష్యమని అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ తెలిపారు.