logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అర్ధరాత్రి రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. *కిన్నెరసానివాగులో అర్ధరాత్రి నేరుగా జెసిబి వంటి భారీ యంత్రాలతో యదేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా, *

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** బూర్గంపాడు మండలం**మార్చి 7**(ఏఐఎంఎం మీడియా ప్రతినిధి)
*********************************

అర్ధరాత్రి రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.

*బూర్గంపాడు మండల పరిధిలోని ఉప్పు సాక , పాత పినపాక పట్టి నగర్ , గ్రామపంచాయతీ పరిధిలో నిత్యం అర్థరాత్రిలు కిన్నెరసాని వాగులో నేరుగా జెసిబి వంటి భారీ యంత్రాలతో యదేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు..*

*బూర్గంపాడు మండల ఉప్పుసాక , పాత పినపాక పట్టి నగర్ , ప్రాంతాల నుండి పాల్వంచ.. కొత్తగూడెం.. ఇల్లందు.. వంటి ప్రాంతాలకు అక్రమ ఇసుక లారీల ద్వారా తరలింపు..*

*ఇసుక అక్రమార్కులకు ఓ మంత్రి అనుచరుల అండదండలు పుష్కలంగా ఉన్నాయంటూ స్థానిక గ్రామ ప్రజల గుసగుసలు...*

* భద్రాద్రి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ నిత్యం ఈ అక్రమ ఇసుక దందా జరుగుతుందంటూ జిల్లా మైనింగ్ అధికారులకు అలాగే బూర్గంపాడు మండల పోలీస్ , రెవెన్యూ శాఖ అధికారులకు తెలిసినా కూడా ఏమాత్రం స్పందించకుండా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఇకనైనా తక్షణమే బూర్గంపాడు మండలంలో జరిగే అక్రమ ఇసుక రవాణాను అరికట్టవలసిందిగా కోరుకుంటున్న స్థానిక గ్రామ ప్రజలు,

165
4972 views

Comment