ఎస్సై చేతుల మీదుగా 10 విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ:
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యా వసతి గృహంలో సిరివెళ్ల ఎస్సై మధుసూదన చేతుల మీదుగా 10వ తరగతి విద్యార్థినిలకు పరీక్ష ప్యాడులను లను శుక్రవారం నాడు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ చేశారు.వందలాది మంది విద్యార్థులకు దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగమల్లేశ్వర్ రెడ్డి తరఫున కస్తూరిబా గాంధీ పాఠశాలలోని 50మంది విద్యార్థులతోపాటు మరిన్ని జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నటువంటి వందలాదిమంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను దానధర్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగిందని అన్నారు.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో కృషి పట్టుదలతో ఇష్టపడి చదువుతూ ఉత్తమ మార్కులు సాధించాలని ఎస్సై మధుసూదన సూచించారు.
10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక ప్రోత్సాహకర బహుమతిగా భావించి పోటీపడి చదివి అధిక మార్కులు సాధించి తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఎస్సై మధుసూదన సూచించారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలందరూ మంచిగా చదివి పరీక్ష కార్డుల కొరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు ఈటుకూరు వెంకట్ ఈ ప్యాడ్లు దాతల సహాయ సహకారాలతో అందజేయడం జరిగిందని తెలిపారు.ఈకార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగమల్లే శ్వర రెడ్డి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.