logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇది కొలిమిగుండ్ల బస్టాండేనా? పేరు కనిపించకుండా ఫ్లెక్సీల జాతర

AIMA న్యూస్ బ్యూరో.నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ వద్ద వింత పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు దిక్సూచిగా ఉండాల్సిన బస్టాండ్ పేరు ఇప్పుడు ఎవరికీ కనిపించకుండా పోయింది. దీనికి కారణం స్థానిక అధికార పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ. ఊరు పేరు కనపడకుండా ఫ్లెక్సీ కట్టడంతో స్థానికులతో పాటు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా బస్సులో వచ్చే కొత్త ప్రయాణికులు బస్టాండ్ పైన ఉండే బోర్డును చూసి తాము ఏ ఊరికి వచ్చామో గుర్తు పడతారు. కానీ, కొలిమిగుండ్లలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బస్టాండ్ ప్రధాన భవనంపై ఉన్న కొలిమిగుండ్ల అనే అక్షరాలు పూర్తిగా మూసుకుపోయేలా భారీ ఫ్లెక్సీ కట్టారు. దీంతో రాత్రి వేళల్లో వచ్చే ప్రయాణికులు, ఇతర ప్రాంతాల వారు తాము ఏ ఊరిలో ఉన్నామో తెలియక అయోమయానికి గురవుతున్నారు.ప్రచారం చేసుకోవడం తప్పు కాదు, కానీ ఊరి పేరునే కప్పేయడం ఏంటి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బస్టాండ్ బోర్డు అనేది ఊరి ఉనికికి ప్రతీక అని, దానిని గౌరవించాల్సింది పోయి ఇలా ఫ్లెక్సీలతో కప్పేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్ బోర్డుపై ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రచారం కోసం ప్రత్యేక స్టాండ్‌లు ఏర్పాటు చేసుకోవాలే తప్ప, ఊరి పేరున్న బోర్డులను వాడటం సరికాదని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు.

82
2525 views

Comment