logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎందరో మహానీయులు పుట్టిన గడ్డ మన భారతదేశం అందులో కారణ జన్ముడు బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్

తెలంగాణ స్టేట్ *"భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **భద్రాచలం గిరిజన భవన్ **(మార్చి 06) (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
***********************************

ఎందరో మహానీయులు పుట్టిన గడ్డ మన భారతదేశం అందులో కారణ జన్ముడు బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్

*జాతిని ఒకే తాటిపై నడిపించిన మహనీయుడు సేవలాల్ మహారాజ్

*భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు,

*ముఖ్య అతిథిగా హాజరైన ఐటిడిఎ పిఓ బి రాహుల్,

భద్రాచలం, మార్చి 06:(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి) ఎందరో మహా నీయులు పుట్టిన గడ్డ మన భారతదేశం అని దాంట్లో కారణ జన్ముడు,బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జాతిని ఒకే తాటిపై నడిపించిన మహనీయుడు సేవలాల్ మహారాజ్ అడుగు జాడలలో నడిచి ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి గిరిజన బిడ్డ కృషి చేయాలని, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు.
శుక్రవారం నాడు భద్రాచలం పట్టణంలోని గిరిజన భవనంలో ఏర్పాటుచేసిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం భద్రాచలం ఆధ్వర్యంలో భోగ బండారో కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమానికి ఐటీడీఏ పీవో బి. రాహుల్ బంజారా కమిటీ సభ్యులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకు కమిటీ సభ్యులు బంజారా సాంప్రదాయ
ప్రాకారం ఘనంగా స్వాగతం పలికారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి భోగ్ బండారో, వింతీ కార్యక్రమం బంజారా సోదరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేసిన అనంతరం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ జాతీ ఐక్యత కోసం అందరం పాటుపడాలని, పిలుపునిచ్చారు. లంబాడీలు దేవుడిగా భావించి
సంత్ సేవాలాల్ ను కొలుస్తారని, సేవాలాల్ జంతుబలికి తీవ్ర వ్యతిరేకి అని,తల్లిదండ్రులను మహిళలను గౌరవించాలని ప్రజలకు ఆయన బోధించారు. ప్రకృతిని వన్యప్రాణులను పరిరక్షించడం ద్వారా మానవ జన్మ సార్థకత చేకూర్చుకోవాలని సూచించేవారని,ఒక సంఘసంస్కర్త, ప్రకృతి ప్రేమికుడు ఆధ్యాత్మిక గురువు, బంజారాల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకుడు, జాతి ఉద్దారకుడు, భారతదేశంలో 10 కోట్ల కు పైచిలుకు జనాభా కలిగిన బంజారాలు ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతిని జరుపుకుంటున్నారని అన్నారు.
అనంతరం ఐటీడీఏ పీవో బి. రాహుల్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ, గురునానక్ ,గౌతమ బుద్ధుడి లాంటి మహనీయులు ప్రజల జీవన విధానం కొరకు ఏ విధంగా పాటుపడ్డారో, లంబాడి బంజారా తెగల జీవన విధానం బాగుపడటానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని, అటువంటి మహనీయుల కోవకు చెందిన వాడే సంత్ సేవలల్ మహా రాజ్ అని, మన భారత దేశంలోనే కాక కర్ణాటక నుండి ఉత్తరప్రదేశ్ వరకు రాజస్థాన్ నుండి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న బంజారా జాతి జీవన విధానం కొరకు ఆయన పాటుపడ్డారని, దేశంలోని గోర్ బంజారా లకు స్ఫూర్తిని నింపిన మహానుభావుడు అని, సంచార జీవితం నుండి ప్రతి బంజారా తెగలను తండ జీవితం వైపు మళ్ళించారని, మద్యం మాంసాలను మాన్పించే ప్రయత్నం చేశాడని, బంజారా తెగల అభివృద్ధికి దేశమంతటా సంచారం చేసి హితబోధ చేశాడని ఆయన అన్నారు. బ్రిటిష్ కాలంలో కూడా మతమార్పిడిని వ్యతిరేకించిన మహనీయుడనీ, సేవాలాల్ మహారాజ్ 18వ శతాబ్దానికి చెందిన గొప్ప ఆధ్యాత్మిక గురువు , సంఘసంస్కర్త, ఆయనను బంజారా లు తమ ఇష్ట దైవంగా పూజిస్తారని, ఆయన ఫిబ్రవరి 15, 1739న అనంతపురం జిల్లాలోని గుత్తి సమీపంలోని సేవాగడ్(రామచంద్రపురం) లో జన్మించారని, అహింస, శాంతి మరియు మానవత్వాన్ని ఆయన బోధించే వారని, ముఖ్యంగా మూఢనమ్మకాలను విడనాడాలని, పర్యావరణాన్ని ప్రేమించాలని మరియు మహిళలను గౌర వించాలని ఆయన ప్రజలకు హితబోధ చేసేవాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం జడ్జి శివ నాయక్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అశోక్, భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, పి వి టి జి అధికారి ధన్య,బంజారా సంఘం నాయకులు బన్సీలాల్, కృష్ణ, గోవింద్, భూక్య సాయి కౌశిక్, మోహన్లాల్, నాగులు, బిక్ష, సైదులు, శీతల నాయక్, రాందాస్, మోహన్ నాయక్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బంజారా సోదరులు, సోదరీమణులు, తదితరులు పాల్గొన్నారు.

343
9266 views

Comment