logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇస్లాం మతంలో ఈ 2 వర్గాలు ఎలా ఏర్పడ్డాయి?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం మతంలో ప్రధానంగా 2 (షియా మరియు సున్నీ) వర్గాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలిసిందే !

ఈ 2 వర్గాలు ఎలా ఏర్పడ్డాయి అని చరిత్రపరంగా చూసినప్పుడు... ఇస్లాం చరిత్రలో నాయకత్వం (leadership) విషయంలో వచ్చిన విభేదాల వల్ల ఏర్పడ్డాయి అని తెలిసింది !

ఇవి రెండూ కూడా... ఇస్లాం మతం యొక్క మూల సిద్ధాంతాల కంటే ఎక్కువగా చరిత్ర, సంప్రదాయం మరియు ఆచారాలపై ఆధారపడి నడుస్తున్నాయి !

632 CE లో ప్రవక్త Muhammad గారు మరణించిన తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న వచ్చింది... “ఇస్లాం సమాజానికి తర్వాతి నాయకుడు ఎవరు?” అని

సరిగ్గా ఇక్కడే... ముస్లింల మధ్య విభేదం ప్రారంభమైంది !

ప్రవక్త గారు ఎవరినీ స్పష్టంగా వారసుడిగా ప్రకటించలేదని సున్నీలు భావించారు... అందుకే సమాజంలోని పెద్దలు సమావేశమై Abu Bakr గారిని మొదటి ఖలీఫాగా ఎన్నుకున్నారు !

వీళ్ళ దృష్టిలో... నాయకుడు ప్రజల సలహాతో రావాలి, ఖలీఫా ఒక రాజకీయ & పరిపాలనా నాయకుడు అని నమ్మారు !!

ప్రవక్త గారు తన చివరి ఉపన్యాసంలో Ali ibn Abi Talib గారినే తన తరువాతి నాయకుడిగా సూచించారని... షియాలు నమ్మారు !

వీళ్ళ దృష్టిలో... నాయకత్వం ప్రవక్త కుటుంబానికే చెందాలి, ఇమామ్‌లు (Ali మరియు వారి సంతానం) దైవం ఎన్నుకున్న ఆధ్యాత్మిక నాయకులు అని !!

680 CE లో జరిగిన కర్భాలా యుద్ధం షియా–సున్నీల విభేదాన్ని మరింత లోతుగా చేసింది !!

ఈ యుద్ధంలో:
Husayn ibn Ali (Ali గారి కుమారుడు, ప్రవక్త గారి మనవడు) మరణించాడు !

అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇద్దరూ...

ఒకే ఖురాన్‌ను నమ్ముతారు!
Muhammad గారిని చివరి ప్రవక్తగా విశ్వసిస్తారు !
ఇస్లాం యొక్క ఐదు స్తంభాలను పాటిస్తారు !

ప్రపంచ ముస్లింలలో సుమారు 85–90% మంది సున్నీలు,
10–15% మంది షియా ముస్లింలు ఉన్నారు !!

Iran లో ఎక్కువ మంది షియా ముస్లింలు & Saudi Arabia లో ఎక్కువ మంది సున్నీ ముస్లింలు ఉంటున్నారు !

ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. వీళ్ళల్లో వీళ్ళు ఎంత కొట్టుకున్నా, బయటి వాడు వస్తే వీళ్ళంతా ఒక్కటౌతారు అనిపించి !

ఇక్కడ మీరు చూడండి... ఇజ్రాయిల్ యూదు దేశం కాబట్టి డైరెక్ట్ అటాక్ చేస్తోంది ఇరాన్. అలాగే తన చుట్టూ ఉన్న అరబ్ దేశాలలోని అమెరికన్ సైనిక స్థావరాల మీద, ఆయిల్ రిఫైనరీల మీద & అత్యంత విలాసవంతమైన హోటల్స్ మీద కూడా అటాక్ చేస్తోంది కానీ ప్రజల మీద ఎక్కడా డైరెక్ట్ అటాక్ చేయడం లేదు !

మరి ఇప్పటివరకు ఈ దేశాలు ఇరాన్ కు రిటార్ట్ ఇచ్చాయా !?

తోటి ముస్లిం దేశాలు ఇరాన్ పై దాడి చేస్తే ఏం సందేశం వెళ్తుంది... ఇజ్రాయిల్ కి డైరెక్ట్ గా సహాయం చేసినట్టు అవుతుంది !!

మొన్నటికి మొన్న రీసెంట్ గా సౌదీ - పాకిస్తాన్ వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చేసుకున్న విషయం మీకు కూడా తెలుసు !?

మరి ఇరాన్, సౌదీ మీద దాడి చేస్తుంటే పాకిస్తాన్ ఎందుకు స్పందించడం లేదు... నోరెత్తితే అమెరికా మడత పెట్టేస్తుంది కాబట్టి !!

పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిగ్గా ఇప్పుడే ఎందుకు కొట్టుకుంటున్నాయి !?

ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటే... దీన్ని మధ్యప్రాచ్యంలో సౌదీ-ఇరాన్ ఆధిపత్య పోరాటం గానే ముస్లిం దేశాలు చూస్తున్నాయి అనిపిస్తుంది !!
(సేకరణ)

0
0 views

Comment