రోడ్డు కోసం నిధులు ఉన్న రోడ్డు నిర్మాణం చేపట్టలేని స్థితిలో ఆర్ అండ్ బి అధికారులు.సిపిఐ
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిన్న కంబలూరు మెట్ట నుండి ఒకలేరు వాగు వరకు రోడ్డు కోసం నిధులు ఉన్నప్పటికీ రోడ్డు నిర్మాణం చేపట్టలేని స్థితిలో ఆర్ అండ్ బి అధికారులు ఉన్నారని సిపిఐ నాయకులు ఎద్దేవ చేశారు. సిరివెళ్ల మెట్ట నుండి గోస్పాడు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టడంలో అధికారుల అలసత్వం
రోడ్డు కోసం నిధులు ఉన్నప్పటికీ రోడ్డు నిర్మాణం చేపట్టలేని స్థితిలో ఆర్ అండ్ బి అధికారులు నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు కనీసం ప్రభుత్వ అధికారులైన రోడ్డు నిర్మాణం చేపడతారా ఇక రోడ్డు వేయరేమో అని రెండు మండలాల ప్రజలు ఆవేదన చెందుతున్నారని, ప్రజా ప్రతినిధులైన చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో సిపిఐ ఆళ్లగడ్డ కార్యదర్శి కె. భాస్కర్, రుద్రవరం మండల కార్యదర్శి పి. బాల నరసింహుడు, ఏఐవైఎఫ్ నాయకులు మధు పాములేటి, సిరివెళ్ల మండల రైతు సంఘం నాయకులు కే. పెద్దిరెడ్డి, పెద్ద కంబలూరు శాఖ కార్యదర్శి నాగ నరసింహుడు, పుల్లయ్య, పాములేటి,రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు