స్వచ్ఛంద మద్యపాన నిషేధాన్ని పలు గ్రామాలలో అమలు
*పట్టిస్తే రూ.10 వేలు.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా!*
జనగామ జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛంద మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూర్, చిన్నరామన్ చర్ల, లింగంపల్లి, రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్లో మద్యపాన నిషేధ తీర్మానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం అమ్మితే రూ. లక్ష జరిమానా, తాగిన వారిని, అమ్మినవారిని పట్టించిన వారికి రూ. 10 వేలు నజరానా ప్రకటించి కఠినంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి.