logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కోచాఫ్యాక్టరీలో ఉద్యోగాల పేరిట గాలం

కోచాఫ్యాక్టరీలో ఉద్యోగాల పేరిట గాలం

ఉద్యోగ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కొందరు

నిరుద్యోగులు ఎవరి మాటలు నమ్మొద్దు

ప్రలోభాలకు గురి కావొద్దంటున్న రైల్వే అధికారులు

కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే మ్యాన్ఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ-మల్టీపుల్ కోచ్ ఫ్యాక్ట రీ)లో కొందరు వ్యక్తులు ఉద్యోగాల పేరిట నిరుద్యో గులకు గాలం వేస్తున్నారు. నిరుద్యోగులు ఈ మాటలు నమ్మొద్దని రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. కాజీపేట కోచాఫ్యాక్టరీ నిర్మాణ పనులను రైల్వేశాఖ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్పీఎన్ ఎల్) కంపెనీకి అప్పగించగా ఆ కంపెనీ.. పవర్ మెక్ ప్రాజెక్టు అప్పగించింది. ఈ క్రమంలో యూనిట్ నిర్మాణం చివరి దశలో ఉండడంతో కొందరు వ్యక్తులు ఇదే అదునుగా భావించి డబ్బు లు దండుకోవడానికి కాంట్రాక్ట్ పద్దతిన ఉద్యోగాలు తీసుకుంటున్నామని సోషల్ మీడియాలో పోస్టు పోస్టు చేస్తున్నారు. దీంతో నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

నిజమా? అబద్దమా? అంటూ తెలుసుకునే ప్రయ త్నంలో తిరుగుతున్నారు. వారంలో రెండు, మూడు రోజులకు ఒకసారి రైల్వే కోచ్ఫ్యాక్టరీ నిర్మాణ పనుల వద్దకు బయోడేట, సర్టిఫికెట్లతో వచ్చి ఉద్యో గాలు అడుగుతున్నారని కోచాఫ్యాక్టరీ అధికారులు పేర్కొంటున్నారు. నిరుద్యోగులు ఇలాంటి ప్రలోభాలను నమ్మొద్దని సూచిస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల విషయంలో రైల్వే శాఖ అధికారికంగా సమాచారం ఇచ్చేవరకు ఆగాలని, అప్పటి వరకు ఎవరి మాటలు నమ్మెదని చెబుతు న్నారు. కాగా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల విష యంపై సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధికారులను 'సాక్షి' వివరణ అడుగగా అలాంటివి ఏమి లేవని వారు తేల్చి చెప్పారు.

0
99 views

Comment