విద్యార్థిని విద్యార్థులలో దాగి ఉన్న మేధాశక్తిని, నైపుణ్యాలను వెలికి తీసి వారి భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలి
*ఐటిడిఏ పిఓ బి రాహుల్,
తెలంగాణ స్టేట్*** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*భద్రాచలం 05 మార్చ్ 26*(ఏఐఎంఎ మీడియా ప్రతినిధి)
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు మరియు గురుకులాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులలో దాగి ఉన్న మేధాశక్తిని, నైపుణ్యాలను వెలికి తీసి వారి భవిష్యత్తును ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రతిభ ప్రోత్సాహక పరీక్షల నిర్వహణ ప్రతిభావంతులను గుర్తించడానికి కృషి చేస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
గురువారం నాడు భద్రాచలంలోని ఏ జి హెచ్ ఎస్ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ప్రతిభ ప్రోత్సాహక పరీక్షల కేంద్రాన్ని ఆయన సందర్శించారు. బాల బాలికలు పరీక్షలు రాస్తున్న తీరును ఆయన పరిశీలించిన అనంతరం పిల్లలకు సూచనలు ఇస్తూ ఎటువంటి భయాందోళనలు మనసులో పెట్టుకోకుండా మీలో దాగి ఉన్న నైపుణ్యాలను ప్రతిభను వెలికి తీసి నిర్భయంగా పరీక్షలు రాసి అత్యుత్తమ ర్యాంకులు తెచ్చుకోవాలని అన్నారు. ఈ పరీక్షలు పదో తరగతి తర్వాత మీరు రాసే కాంపిటేటివ్ పరీక్షలు, జేఈఈ, నీట్, ఎంసెట్ పోటీ పరీక్షలు రాయడానికి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ఈ ప్రతిభా ప్రోత్సాహక పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థినిలకు ఉపాధ్యాయులు కానీ ఇంజ్యులేటర్స్ గాని ఎవరు సహాయ సహకారాలు అందించవద్దని, పిల్లలు వారి ప్రతిభ ద్వారానే సొంతంగా పరీక్షలు రాసేలా చూడాలని, గ్రూప్స్ పరీక్షలు ఏ విధంగా పగడ్బందీగా నిర్వహిస్తారో ఆ విధంగా చాలా జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూడాలని పరీక్షా కేంద్రం ప్లయింగ్ స్క్వాడ్ ఏ సి యం ఓ రమేష్ కు ఆదేశించారు. అనంతరం పరీక్ష హాల్లో విద్యార్థినీ విద్యార్థులకు కల్పించిన వసతి సౌకర్యాల గురించి హెచ్ ఎం ను అడిగి తెలుసు కున్నారు. పరీక్షలు జరుగు సమయంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ మరియు డిడి ట్రైబల్ వెల్ఫేర్ అశోక్ సందర్శించి ఉపాధ్యాయులు ఎవరు పరీక్షా హాల్లోకి వెళ్లకూడదని, పరీక్ష హాలులో సెల్ ఫోన్లు గాని మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి ఉండకూడదని, ఇంజ్యులేటర్లు ఎవరు పిల్లలకు సందేహాలు వస్తే వివరణ ఇవ్వకూడదని అన్నారు. వేరే పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులకు సంబంధించిన ఉపాధ్యాయులు ఎవరు పరీక్షా హాల్లోకి రాకుండా సంబంధిత స్కాడ్ చూడాలని, ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి ర్యాంకులు సాధించాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకులం మరియు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు కలిపి 89 ఇన్స్టిట్యూషన్లలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు 395 మంది ప్రతిభ ప్రోత్సాహ పరీక్షలు రాశారని, ఏ జి హెచ్ ఎస్ భద్రాచలంలో 103, ఏ హెచ్ ఎస్ పాల్వంచలో 129, ఏ జి హెచ్ ఎస్ రోమ్పేడులో 87, ఖమ్మంలోని గొల్లగూడెం ఏ జి హెచ్ ఎస్ 71 మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభా ప్రోత్సాహ పరీక్షలు రాశారని అన్నారు.
ప్రతిభ ప్రోత్సాహ పరీక్షలు పగడ్బందీగా మరియు ఎటువంటి అవకతవకలు జరగకుండా నిర్వహించడానికి సంబంధిత ఏటీడీవోలు మరియు ఎస్ సి ఆర్ పి లను ప్లయింగ్ స్క్వాడ్, సీట్టింగ్స్ స్క్వాడ్ గా నియమించామని, భద్రాచలం ఏ జి హెచ్ ఎస్ ప్లేయింగ్ స్క్వాడ్ ఏ సి ఎం ఓ రమేష్, రొం పేడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఏటీడీవో చంద్రమోహన్, ఏ హెచ్ ఎస్ పాల్వంచ ప్లేయింగ్ స్క్వాడ్ భారతీదేవి, ఖమ్మం ఢీగోల్ల గూడెం ప్లేయింగ్ స్కాడ్ ఏ సి ఎం ఓ రాములు, ఏటీడీవో రమేష్ లు వ్యవహరించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిట్టింగ్స్ స్క్వాడ్లుగా ఎస్ సి ఆర్ పి లు విటల్ బాబు, లక్ష్మీనారాయణ, శంకర్, మున్నా, హరిలాల్, రమేష్, పాఠశాల హెచ్ఎంలు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.