logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

コ జిల్లా వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఒక ఉద్యమంలా కొనసాగలి. వ్యాప్తంగా కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి.

*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 5 :-

*జిల్లా వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఒక ఉద్యమంలా కొనసాగలి.*

*వ్యాప్తంగా కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి.*

*కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు 37 కెమెరాల ప్రారంభం.*

*ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధి నందు 250 కెమెరాలతో నిఘా*

*ఒక కెమెరా వందమంది పోలీసులతో సమానం.*

*నేరాలు, దొంగతనాలు జరగకుండా 24 గంటల పర్యవేక్షణ.*

*37 కెమెరాలను అందించిన ఆదిలాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్.*

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్*

జిల్లా వ్యాప్తంగా సిసిటీవీ కెమెరాల ఏర్పాటు ఒక ఉద్యమంలో కొనసాగాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ పిలుపునిచ్చారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా అందజేసిన 37 (21 నూతన + 16 రిపేర్ చేసిన కెమెరాలను) కెమెరాలను జిల్లా ఎస్పీ అధికారులు డాక్టర్ల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా విధులను నిర్వర్తిస్తుందని, 24 గంటలు పర్యవేక్షణతో దొంగతనాలను నేరాలను, ఘోరాలను అరికట్టవచ్చని, ఒకవేళ జరిగిన వాటిని ఛేదించవచ్చని ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పట్టణంలో నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు తమ వార్డులలో కనీసం 10 కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా, అదే విధంగా గ్రామాలలో ఎన్నికైన నూతన సర్పంచులు తమ గ్రామాలలో కెమెరాలను ఏర్పాటు చేసుకొని నేరాలను జరగకుండా అడ్డుకోవడానికి, ఒకవేళ జరిగిన నేరాలలో నిందితులను పట్టుకోవడంలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పట్టణంలో ప్రస్తుతం 250 కెమెరాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షణతో కొనసాగుతుందని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను బస్టాండ్ నందు, రైల్వే స్టేషన్ నందు, మహాలక్ష్మి వాడ, రిమ్స్ ప్రాంగణాల నందు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. వ్యాపార సంస్థల సంఘాలు, ఇతర సంఘాలు సిసిటివి కెమెరాల ఏర్పాటుకు జిల్లా పోలీసులతో సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న మొత్తం సీసీటీవీ కెమెరాలను హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్స్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరిగిందని, సీసీటీవీ కెమెరాలు ప్రజల రక్షణ, భద్రత, బాధ్యతలను చేసే పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, ఐఎంఏ అధ్యక్షుడు వెంకటరెడ్డి, డాక్టర్లు, రిమ్స్ ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

0
333 views

Comment