రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి భాషా దినోత్సవ పోటీలు
అనకాపల్లి జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు, ఆంగ్ల, హిందీ భాషా దినోత్సవం సందర్భంగా మండల స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించబడి విజయవంతంగా ముగిశాయి. మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలల నుండి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల భాషా నైపుణ్యాల అభివృద్ధి కోసం స్టోరీ టెల్లింగ్, డిబేట్, క్విజ్, స్కిట్, రీడింగ్ కాంప్రహెన్షన్ అనే ఐదు విభాగాల్లో ప్రతి భాషకు సంబంధించిన పోటీలు జరిగాయి. విద్యార్థులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. విజేతలను రేపు జిల్లా స్థాయి భాషా దినోత్సవ కార్యక్రమానికి తీసుకువెళ్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి రోలుగుంట ప్రధానోపాధ్యాయులు టి.వి. శేషగిరిరావు, మండల విద్యాశాఖాధికారి (MEO) జగ్గారావు అధ్యక్షత వహించగా, ఆంగ్ల ఉపాధ్యాయినీ పి.వి.ఎం. నాగజ్యోతి ఆధ్వర్యంలో జరిగింది. మండల పాఠశాలల భాషా ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో భాషా ఆసక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుతాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.