logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వాడో కామాందుడు.. క్లాస్ రూమ్‌లోనే నన్ను..

మెదక్ జిల్లా ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థినిపై అదే కళాశాలకు చెందిన విద్యార్థి లైంగిక దాడి చేశాడు. అంతేకాక పూర్వవిద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు.
బాధితురాలు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. సోమవారం ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ కుమార్‌ తెలిపిన మేరకు.. బాచుపల్లి వీఎన్‌ఆర్‌ కాలేజీలో నిజాంపేట్‌ శ్రీనివాస్‌ నగర్‌కు చెందిన విద్యారి్థని ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది.

ఇదే ఈ కాలేజీలోనే చదువుతున్న ఆశిష్‌ బాధితురాలికి ఇనస్టా గ్రామ్‌లో పరిచయమయ్యాడు. 2024 నుంచి ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అంతేకాక గత సంవత్సరం కాలేజీలోనే మత్తు చాక్లెట్‌ ఇచ్చి లైంగిక దాడిచేశాడు. ఇలా పలుపర్యాయాలు దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఇదే కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థి ప్రవీణ్‌ను ఆశిష్‌ పరిచయం చేశాడు. అతను కూడా బాధితురాలిని లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కాలేజీ యాజమాన్యం లైంగిక దాడి విషయం తెలుసుకుని అప్పట్లోనే ఆశిష్‌ తల్లిదండ్రులను పిలిపించి డిక్లరేషన్‌ రాయించుకున్నట్లు తెలిసింది.

0
0 views

Comment