logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజాప్రతినిధుల సందర్శన – డెల్టాకేర్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఘన సన్మానం

మెట్ పల్లి, మార్చి 04 (తరి రాజశేఖర్):

మెట్ పల్లి పట్టణంలోని డెల్టాకేర్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను పలువురు ప్రజాప్రతినిధులు సందర్శించారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన తిరుమల వసంత భర్త గంగాధర్, మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్, కౌన్సిలర్లు తెడ్డు విజయ్, రిజ్వాన్ పాషా లు మా ఆహ్వానం మేరకు కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్రం నిర్వాహకులు ప్రజాప్రతినిధులను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం డయాగ్నస్టిక్ సెంటర్‌లో అందిస్తున్న వివిధ వైద్య పరీక్షలు, ఆధునిక పరికరాలు, రోగులకు అందిస్తున్న సేవల గురించి వారికి వివరించారు.
ప్రజలకు నాణ్యమైన, సమయోచిత వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. డెల్టాకేర్ వంటి కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడి, భవిష్యత్తులో కూడా ప్రజల ఆరోగ్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సెంటర్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

7
826 views

Comment