అత్యవసర సేవలను తప్పుదోవ పట్టిస్తే జైలు శిక్ష తప్పదు – భీమడోలు ఎస్ఐ వెల్లడి.
అత్యవసర సేవలను తప్పుదోవ పట్టిస్తే జైలు శిక్ష తప్పదు – భీమడోలు ఎస్ఐ వెల్లడి.
భీమడోలు మండలం అరుంధతి కాలనీకి చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో గ్రామంలో గొడవ చేసి, డయల్ 112కు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను తప్పుదోవ పట్టించారు.
పోలీసులు వెంటనే స్పందించి విచారణ జరపగా అది కావాలని చేసిన తప్పుడు కాల్ అని తేలింది. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని Second Class Magistrate Court, Eluru లో హాజరు పరిచారు.
కేసును పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి K. V. R. Maheswari గారు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిని జిల్లా జైలుకు తరలించారు.
ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు.అత్యవసర సేవలను దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరం.