logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నాటు సారా వల్ల కలిగే అనర్ధాలను తెలియజేయండి: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.

నంద్యాల (AIMA MEDIA): నాటు సార విక్రయదార కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా నాటుసార కుటుంబాల పునరావాస వ్యూహం మరియు కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నంద్యాల డిఎస్పీ మంద జావలి అల్ఫోన్స్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, మెప్మా పిడి వెంకట దాసు, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాటు సారా విక్రయదార కుటుంబాలను పునరావాసం కల్పనలో భాగంగా నవోదయం 2.0 కార్యక్రమం వారి జీవనోపాధి కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏ కేటగిరీలో 19 గ్రామాలు, బి కేటగిరీలో 19 గ్రామాలు, సి కేటగిరిలో 91 గ్రామాలను జిల్లాలో నాటు సారాను పూర్తి స్థాయిలో నివారించడానికి 19 ఫిబ్రవరి 2025 నుండి సెప్టెంబరు 12వ తేది వరకు పకడ్బందీ ప్రణాళిక వారీగా నాటు సారా తయారీని పూర్తి స్థాయిలో తొలగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. నాటు సార, కల్తీ నెయ్యి లాంటి ప్రాణాంతకమైన వాటిని చేయడం ద్వారా ప్రజా ఆరోగ్యం పట్ల చెలగాటం ఆడడం వల్లనే మీ మీద కేసులు నమోదవ్వడం జరుగుతోందన్నారు. అలాకాకుండా మీ అంతటా మీరు నాటు సార వదిలేసి ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మారడానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో ఇప్పటి వరకూ 222 కుటుంబాలు జీవనోపాధి కల్పించమని కోరడం జరిగిందని, అందులో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి అయిన విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పిస్తామని, మహిళలకు చేతివృత్తులు, కుట్టు అల్లికలు, పేపర్ కప్స్, జ్యూట్ బ్యాగ్స్ తయారీ, మహిళలకు పొదుపు గ్రూపులుగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిఆర్డిఎ, మెప్మా పిడిలను కలెక్టర్ ఆదేశించారు.పురుషులకు పశుపెంపకం, తేనటీగ పెంపకం లాంటి జీవనోపాధి మార్గాల దృష్టి సారించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా సదురు కుటుంబాలకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను అందజేయాలను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు.

0
12 views

Comment