logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభించిన డాక్టర్ రవి కృష్ణ.

నంద్యాల (AIMA MEDIA): స్థానిక బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణమండపం రోడ్డులో కళారాధన సాంస్కృతిక సంస్థ సమాచార సాంకేతిక విభాగ కార్యదర్శి మజీద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగం ఎంచుకున్నప్పటికీ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అని అన్నారు. అనేక సంవత్సరాలుగా కంప్యూటర్ శిక్షకుడిగా పనిచేసిన అనుభవం కలిగి,కళారాధన సమాచార సాంకేతిక విభాగం కార్యదర్శిగా ఉన్న మజీద్ నూతన కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభించడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రం మజీద్ మాట్లాడుతూ తనతోపాటు సమద్ విద్యార్థులకు కంప్యూటర్ బేసిక్స్, జావా, ఎం.ఎస్. ఆఫీస్, ఇంటర్నెట్ తదితర అంశాలలో కంప్యూటర్ శిక్షణ కోర్సులు నిర్వహిస్తామని తెలిపారు. 16 కంప్యూటర్ సిస్టమ్స్ తో యువతీ îయువకులకు వేరువేరుగా ఏర్పాటు చేశామని అన్నారు.కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రంగనాథ్ సెంటర్ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తారని తెలిపారు. కళారాధన, లయన్స్ క్లబ్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ వి రమణయ్య, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.ఆర్.ఎస్ ప్రసాద్, మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ పిజి కాలేజీ ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్,లయన్స్ క్లబ్ సభ్యులు వాసు, రామయ్య,కళారాధన సభ్యులు శివరామిరెడ్డి,వలి, మహబూబ్ బాషా,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment