23 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కులను పలు గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు.