logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గిరి మాల్ట్ పనులు వేగవంతం చేయాలి *సంబంధిత ఇంజనీర్లను ఆదేశించిన ఐటీడీఏ పీవో బి రాహుల్,.



తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
*భద్రాచలం ఐటీడీఏ ** ఫిబ్రవరి 28**
(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

భద్రాచలం పట్టణ ప్రజలకు మరియు ఆదివాసి గిరిజనులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మాణం చేపడుతున్న గిరి మాల్ట్ పనులు వేగవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సంబంధిత ఇంజనీర్లకు ఆదేశించారు.
శనివారం నాడు భద్రాచలం పట్టణంలోని జిసిసి గిరి బజార్ ను గిరి మాల్టుగా ముస్తాబు చేయుటకు జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. శ్రీరామనవమి నాటికి గిరి మాల్ట్ ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించినందున సంబంధిత ఇంజనీర్లు ప్రజలకు మరియు చూపరులకు ఆకట్టుకునేలా గిరి మాల్ట్ ముందు భాగం మంచి డిజైన్ గా రూపొందించాలని అన్నారు. గిరిజన మహిళలకు జీవనోపాధి కల్పించడానికి మరియు ఆదివాసి గిరిజన కుటుంబాలకు మరియు పట్టణ ప్రజలకు కల్తీ లేని వివిధ రకాల నిత్యవసర వస్తువులు అమ్మకాలు చేయడానికి ఏర్పాటు చేస్తున్న గిరి మాల్ట్ పనులు నాసిరకంగా కాకుండా నాణ్యతగా ఉండేలా పనులు చేసి త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, డి ఈ హరీష్, టి ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

119
2678 views

Comment