పెద్దింటమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకున్న పీవీఎస్ఎన్ రాజు
రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామంలో ఘనంగా జరుగుతున్న పెద్దింటమ్మ తల్లి ఉత్సవాలకు చోడవరం జనసేన పార్టీ ఇన్చార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తి భావంతో అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలతో మమేకమయం అయ్యారు. ఈ సందర్భంగా జానకిరాంపురం కోఆపరేటివ్ బ్యాంకును మొదట పర్యటించిన పివిఎస్ఎన్ రాజు, చైర్మన్ బలిసి మహారాజు, కార్యకర్తలతో సానుకూలంగా మాట్లాడారు. అక్కడి కార్యకలాపాల గురించి చర్చించిన తర్వాత, కుసర్లపూడి పెద్దింటమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక అర్చనలు చేసి, భక్తులతో కలిసి ఆనందించారు.ఈ సందర్భంగా మాట్లాడిన రాజు, "పెద్దింటమ్మ తల్లి ఆశీస్సులతో మన గ్రామీణ ప్రాంతాలు మరింత ఆర్థిక, సామాజిక పురోగతి సాధిస్తాయి. జనసేన పార్టీ స్థానిక ఉత్సవాలు, సంస్కృతిని ఎల్లప్పుడూ పోషిస్తుంది" అని పేర్కొన్నారు. గ్రామస్తులు ఆయన సందర్శనను స్వాగతించి,ఎంతో సంతోషించారు..