logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సాయుధ సిబ్బందికి క్రమశిక్షణ తప్పనిసరి.* *విధులలో నిర్లక్ష్యం వహించవద్దు.* *సిబ్బందికి విశ్రాంతి గది, బైక్ షెడ్ ప్రారంభం.*

*పత్రికా ప్రకటన*
అదిలాబాద్ జిల్లా,
ఫిబ్రవరి 27 :-

*

*కేటాయించిన విధులను తప్పనిసరిగా నిర్వహించాలి.*

*శాంతిభద్రతల పరిరక్షణలో సాయిధ సిబ్బంది పాత్ర కీలకమైనది*

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్*

సాయుధ సిబ్బందికి విధులలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈరోజు స్థానిక పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో సాయుధ సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని మరియు వాహనాల రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన షెడ్డును జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి ప్రారంభించారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో సాయుధ సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమని, బాధ్యతాయుతమైన ప్రవర్తన ప్రతి సిబ్బందికి తప్పనిసరి కావాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోదని, ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు.
సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా వారు మరింత ఉత్సాహంతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించగలరని తెలిపారు. విశ్రాంతి గది ఏర్పాటు చేయడం వల్ల సిబ్బంది విధుల మధ్యలో విశ్రాంతి తీసుకునే సౌకర్యం లభిస్తుందని, వాహనాల రక్షణ కోసం షెడ్ నిర్మాణం భద్రతపరంగా ఎంతో ఉపయోగకరమని చెప్పారు.

కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి. మురళి, ఎన్. చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్ మరియు ఇతర సాయుధ సిబ్బంది పాల్గొన్నారు.

2
642 views

Comment